కృతి శెట్టి, ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (L.I.K) చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ ఇద్దరు తారలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ, గతంలో తాను కూడా ఒక బ్రేకప్‌ను ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని, అయితే ప్రస్తుతం తాను పూర్తిగా ‘సింగిల్’ అని ఆమె స్పష్టం చేసింది. తనపై నెగిటివిటీ ప్రచారం చేసే వారిని అస్సలు ఉపేక్షించకుండా వెంటనే బ్లాక్ చేస్తానని కృతి కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ తన శైలిలో నవ్వుతూ స్పందిస్తూ.. తన జీవితంలో ఒకటి కాదు, చాలా బ్రేకప్స్ జరిగాయని నిజాయతీగా ఒప్పుకున్నాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల మెసేజ్‌లకు తాను చాట్ జీపీటీ కంటే వేగంగా రిప్లైలు ఇచ్చేవాడినని, అంతలా ప్రయత్నించినా చివరకు అమ్మాయిలే తనను బ్లాక్ చేశారని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రేమలో ఇన్ని పరాజయాలు ఎదురైనా ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చాడు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.









