ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉండడం సాధారణమే. కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కర్రీలు, ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు.
కానీ, కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పదార్థాలు సరిగా నిల్వ కానవచ్చు, రుచి, గుణం కూడా మారిపోవచ్చు.
వివిధ పరిశోధనల ప్రకారం, కొన్ని పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల క్యాన్సర్ కారకాలు గా మారవచ్చని, కొన్ని విషతుల్యమవుతాయని తెలిపారు. అందువల్ల ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు.
హానికరమైన ఆహార పదార్థాలు: డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ పౌడర్, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళాదుంపలు. ఫ్రిజ్‌లో తప్పనిసరిగా పెట్టాలంటే గాజు జార్‌లో ఉంచడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచించారు.









