ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా తుపాన్లు, భారీ వర్షాల కారణంగా భూగర్భ నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. మొన్నటివరకు మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిశాయి. తాజా దిత్వా తుపాను కూడా జిల్లాకు తీవ్ర వర్షాలు కురిపించడంతో చెరువులు, గుంటలు, కాలువలు నిండిపోయాయి. వాగులు, వంకలు, అనేక కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి.
శ్రీకాళహస్తి ప్రాంతంలో స్వర్ణముఖి నది నిండుగా ప్రవహిస్తోంది. స్థానిక చెరువులు, Overflow అవుతూ, సమీప ప్రాంతాల్లో కూడా నీరు చేరడం మొదలైంది. కైలాసగిరికి సమీపంలో ఉన్న కాలువలు కూడా పూర్తి స్థాయిలో ప్రవహించాయి.
గిరి ప్రదక్షిణ మార్గంలో తెల్ల గణపతి ఆలయం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన బోరు కూడా నీటితో నిండిపోతోంది. సాధారణ పరిస్థితుల్లో బోరు కొద్దిసేపు పనిచేస్తే సరిపోతుంది, కానీ వరుస తుపాన్ల కారణంగా భూగర్భ నీటిమట్టం పెరగడం వల్ల బోరు తాకకుండానే నీరు వెలువడుతుంది.
భక్తులు, సానికులు ఈ వింతను గమనిస్తున్నారు. వరుస తుపాన్ల కారణంగా భూగర్భ నీటిమట్టం పెరుగుదల, చెరువులు, కాలువలుOverflow కావడం వంటి పరిణామాలు స్థానికులకు ఆశ్చర్యకరంగా, అలానే ముఖ్యంగా సాగునీటి వనరుల కోసం అవకాశంగా కూడా మారుతున్నాయి.









