విపరీత కరణి యోగా – రక్తప్రసరణ, విశ్రాంతి, నిద్రలో వింత ఫలితాలు

Viparita Karani yoga helps improve circulation, menstrual health, sleep, spine relief, and reduces leg swelling.

విపరీత కరణి (Legs Up the Wall) యోగా ఒక సరళమైన, ఇంట్లో చేసుకోగల ఆసనం. ఇది రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తితే రక్తం గుండె వైపు సులభంగా తిరిగి ప్రవహిస్తుంది. దీని వల్ల పాదాలు, కాళ్లలో swelling తగ్గి, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

పోస్చర్ చేయడం ద్వారా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్లు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. నిద్రలేమి సమస్యల కోసం దీని ఫలితాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి.

విపరీత కరణి వేరికోస్ వెయిన్స్, పాదాల్లో fluid retention సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఇది excess fluid ను డ్రెయిన్ చేసి నరాల వాపును తగ్గిస్తుంది. అలాగే పెల్విక్ ఏరియాలో రక్తప్రవాహం మెరుగవడం వల్ల menstrual cramps, lower back pain, కండరాల నొప్పి కూడా తగ్గుతాయి.

వీటిని చేయడానికి గోడ పక్కన వెల్లకిలా పడుకుని, కాళ్లను నిటారుగా గోడకు ఆనించి, ‘L’ ఆకారంలో శరీరాన్ని సర్దుకుని, 5–15 నిమిషాల పాటు దీర్ఘ శ్వాసతో ఉండాలి. గర్భిణులు మొదటి త్రైమాసికంలో ఉన్న స్త్రీలు, uncontrolled high blood pressure, glaucoma ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే శరీరం, మనసు రెండూ లాగా సులభంగా అనిపిస్తాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share