కుమారుడితో ఒంటరి జీవితం సులభం కాదు

After her divorce, Sania Mirza shares the challenges of being a single mother to her son. Every day brings a new challenge, and filmmaker Farah Khan praised her courage on her podcast.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన భర్త పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, కుమారుడితో ఒంటరిగా జీవిస్తోంది. ఈ పరిస్థుతిలో తన అనుభవాలను అరుదుగా పంచుకునే ఆమె, ఇటీవల ఫరా ఖాన్ పాడ్‌కాస్ట్‌లో తన మనసు విప్పారు.

“ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం. ప్రతి రోజు ఒక కొత్త సవాల్ ఎదురవుతుంది” అని సానియా వెల్లడించారు. తన కుమారుడికి తల్లి, తండ్రి బాధ్యతలను తానే భరిస్తున్నామని చెప్పారు.

గతంలో పానిక్ అటాక్ సమయంలో ఫరా ఖాన్ తనకు బలంగా అండగా నిలిచిందని సానియా గుర్తుచేశారు. ఫరా ఖాన్ సానియాకు ధైర్యాన్ని, బలాన్ని ప్రశంసిస్తూ “ఆమె నిజమైన ఫైటర్. జీవితంలో ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడుతుంది” అని అన్నారు.

విడాకుల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుంది అని సానియా అంగీకరించారు. “తల్లి, తండ్రి కలిసి ఉండడం పిల్లల కోసం ఉత్తమం. కానీ పరిస్థితులు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండవు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో హైదరాబాదులో స్థిరపడుతూ కొత్త జీవన మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share