హీరో NEX 3: మైక్రో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ఆవిష్కరణ

Hero NEX 3 micro electric four-wheeler unveiled at Milan EICMA 2025, ideal for short-distance city commuting.

హీరో మోటోకార్ప్ రెండు చక్రాల వాహనాల నుంచి కొత్త అడుగు వేసింది. మిలాన్‌లో జరిగిన EICMA 2025లో NEX 3 అనే చిన్న మైక్రో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ను వీడా బ్రాండ్‌లో కొత్త ‘నోవస్’ రేంజ్‌లో పరిచయం చేసింది. ఇది హీరోని అల్ట్రా-కాంపాక్ట్ మొబిలిటీ సెగ్మెంట్‌లోకి తీసుకెళ్తోంది. NEX 3ని షార్ట్ డిస్టెన్స్ సిటీ కమ్యూటింగ్ కోసం పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

NEX 3 నాలుగు చక్రాలతో, నారో ఫుట్‌ప్రింట్, ఇద్దరు ప్యాసింజర్స్ ప్రయాణం చేయగలిగేలా రూపొందించబడింది. రెండో వ్యక్తి డ్రైవర్ వెనకాల సీట్‌లో కూర్చుంటాడు. క్లోజ్డ్ క్యాబిన్ సేఫ్టీ, కంఫర్ట్ అందిస్తుంది. చిన్న కారు లాగా కనిపించినా, మాన్యువరబిలిటీ, ఎఫిషియెన్సీ టూ-వీలర్ EV‌లా ఉంటుంది.

హీరో NEX 3 మధ్యలో బ్యాలెన్స్, కాంపాక్ట్ ప్రాక్టికాలిటీ, వేదర్ ప్రొటెక్షన్, మినిమల్ ఫుట్‌ప్రింట్ కలిగి ఉంది. నోవస్ పోర్ట్‌ఫోలియోలో NEX 1, NEX 2 మైక్రో-మొబిలిటీ వాహనాలు మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌లు ఉన్నాయి. వీడా DIRT.E సిరీస్ కింద కొత్త ఆఫ్-రోడ్ EV మోటార్‌సైకిల్ లైన్ కూడా అనౌన్స్ చేశారు.

హీరో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా కాంపాక్ట్ EV ఫార్మాట్స్‌లోకి విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అర్బన్ మొబిలిటీలో చిన్న, ఎఫిషెంట్ వాహనాల వైపు దృష్టి సారిస్తోంది. ప్రైసింగ్, టెక్నికల్ స్పెక్స్ మరియు మార్కెట్ రోల్‌అవుట్ వివరాలు ప్రొడక్షన్ వెర్షన్ దగ్గర్లో లభిస్తాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share