మొదటి రోబోటిక్ మెదడు శస్త్రచికిత్స
రోబోటిక్ వైద్యంలో విప్లవాత్మక ఘట్టంగా సౌదీ అరేబియాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ చరిత్ర సృష్టించింది. రియాద్‌లోని ఈ ఆసుపత్రి ప్రపంచంలోనే మొదటిసారిగా రోబోటిక్ ఇంట్రాక్రానియల్ ట్యూమర్ రిసెక్షన్ (మెదడు కణితి తొలగింపు)ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సర్జరీ న్యూరోసర్జరీ రంగంలో ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణం నెలకొల్పింది.
రోగి ఆరోగ్యం అద్భుతం
తీవ్రమైన తలనొప్పి మరియు ఏకాగ్రత కోల్పోవడంతో బాధపడుతున్న 68 ఏళ్ల వ్యక్తికి ఈ శస్త్రచికిత్స చేపట్టారు. రోబోటిక్ చేతుల సహాయంతో 4.5 సెం.మీ పరిమాణంలో ఉన్న కణితిని సర్జన్లు విజయవంతంగా తొలగించారు. ముఖ్యంగా, రోగి కేవలం 24 గంటల్లోనే పూర్తిగా స్పృహతో డిశ్చార్జ్ కావడం వైద్య రంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది సాధారణ శస్త్రచికిత్సల కంటే నాలుగు రెట్లు వేగంగా కోలుకోవడమే.
రోబోటిక్ టెక్నాలజీతో అద్భుత ఖచ్చితత్వం
స్కల్ బేస్ ట్యూమర్‌లకు కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్ హోముద్ అల్-దహాష్ మాట్లాడుతూ, ఈ రోబోటిక్ టెక్నాలజీ అత్యున్నత ఖచ్చితత్వం, నియంత్రణను అందిస్తుందని తెలిపారు.









