మండల కేంద్రం న్యాల్కల్ లోని కస్తూర్బా గాంధీ పాఠశాల (కేజీబీవీ)ను శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రతిబా శేఖర్ సందర్శించి విద్యార్థుల కోసం ఒక్కరోజు టీచర్‌గా మారారు.
సందర్బంగా, ఆమె విద్యార్థులను పాఠాల పట్ల శ్రద్ధ వహించమని, ఉన్నత శిఖరాల వరకు ఎదగమని సలహా ఇచ్చారు.
తరగతి గదిలో విద్యార్థుల సబ్జెక్టు విజ్ఞానాన్ని అడిగి తెలుసుకుని, బోర్డుపై పాఠాలు బోధించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎస్వోకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంట ఎమ్మార్వో ప్రభులు, కేజీబీవీ అద్యాపక బృందం తదితరులు కూడా ఉన్నారు.
Post Views: 16









