జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక – నవీన్ యాదవ్ ఘన విజయం

Naveen Yadav wins Jubilee Hills by-election with 24,729-vote margin; his mother Kasthuri expresses deep emotions.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్ష్ అలరింది. నియోజకవర్గంలో పనిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం ఆనందం వ్యక్తం చేశారు.

నవీన్ యాదవ్ తల్లి కస్తూరి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాట్లాడుతూ, ‘‘నా కొడుకు గెలవడం చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి వెయ్యి కోట్ల దండాలు. 40 ఏళ్ల కష్టం ఫలించింది. నా బిడ్డను తొక్కే ప్రయత్నం చేశారు, కానీ భగవంతుడి దయ వల్ల నా కొడుకు గెలిచాడు’’ అని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందడం గమనార్హం. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీగా నమోదు అయ్యింది.

ఈ విజయంతో యువ నాయకుడు నవీన్ యాదవ్ తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మద్దతుతో ఆయన భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారని అంచనా.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share