బీహార్ అలీనగర్ నియోజకవర్గంలో 25 ఏళ్ల ఫేమస్ సింగర్ మైతిలీ ఠాకూర్ ఘన ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 9,769 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ విజయం కొనసాగితే, మైతిలీ బీహార్ అసెంబ్లీలో అత్యంత చిన్న వయస్సు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తారు.
మైథిలీ చిన్నప్పటి నుంచే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా గుర్తింపు పొందారు. భక్తి, భోజ్‌పూరీ మరియు హిందీ ఫోక్ పాటల్లో ప్రత్యేక ప్రతిభ చూపించి, ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆమెకు ప్రథమ సారి రాజకీయ బరిలోకి అడుగుపెట్టినప్పటికీ బీజేపీ టికెట్ ఇవ్వడం, అలీనగర్‌లో చారిత్రక విజయానికి అవకాశం కల్పిస్తుంది.
మైతిలీ కుటుంబం మొత్తం సంగీతంలో నిపుణులు. ఆమె సోదరులు రిషవ్, అయాచీ వివిధ వేదికల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ఎన్నికల ప్రచారంలో సహకరించింది. మైతిలీ తన అజెండాను సంస్కృతి, విద్య, యువత ఉపాధి అనే మూడు ప్రధాన అంశాలపై ఏర్పరచి, అలీనగర్‌ను ‘సీతానగర్’గా మార్చే ప్రతిపాదనను కూడా తెచ్చారు.
మైదానంలో ముందున్న మైథిలీ మీడియాతో మాట్లాడుతూ, “నాపై ప్రజల నమ్మకం నాకు చాలా ప్రేరణ. ఇది నా విజయం మాత్రమే కాదు, ప్రజల విజయం. మహిళల కోసం నితీశ్ కుమార్ చేసిన పనులు నాకు సహకరించాయి. అలీనగర్ ఖచ్చితంగా సీతానగర్‌గా మారుతుంది” అని పేర్కొన్నారు.








