దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార–పానీయ ఫెయిర్‌గా గుర్తింపు పొందిన ఫుడ్ ఎ ఫెయిర్ 2025 హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫెయిర్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఫుడ్ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి, ఆధునిక, స్థిరమైన, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రిటైలర్లు, హోల్ సేలర్లు, తయారీదారులు, ఫుడ్ ప్రాసెసర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు, షెఫ్స్, స్టార్టప్‌లు, కొనుగోలుదారులు ఒకే వేదికపై చేరడం ఈ ఫెయిర్ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఫుడ్ ఎ ఫెయిర్ కలినరీ కార్నర్‌ను ప్రవేశపెట్టారు. ప్రముఖ షెఫ్స్ లైవ్ కుకింగ్ డెమోస్, టేస్టింగ్ సెషన్లు, ప్రాంతీయ వంటకాల వైభవ ప్రదర్శనలు ఉంటాయి.
ఫెయిర్ ద్వారా ఆధునిక వ్యాపారం, ఫుడ్ ఇన్నోవేషన్, విలువ పెంపు, మార్కెట్ యాక్సెస్ మధ్య గల దూరాలను తగ్గిస్తూ కొత్త ట్రెండ్లు, టెక్నాలజీలు, వ్యాపార అవకాశాలను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యం. ఈ నెల 16 వరకు కొనసాగనున్న ప్రదర్శనలో బి2బి మీటింగులు, ప్రోడక్ట్ లాంచ్‌లు, డెమో స్ట్రేషన్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్లు ప్రత్యేకంగా ఉంటాయి.
బ్లిట్జ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌కు తెలంగాణ ప్రభుత్వ ఎమ్‌ఎస్ఎంఇ శాఖ, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ సహకారం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పుల్లెల గోపిచంద్, డా. తారా సత్యవతి, జె. స్టాన్లీ, విశాల్ రెడ్డి, జీ. బీ. కె. రావు తదితరులు పాల్గొన్నారు.









