సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం దుర్ఘటన జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఏర్పుల లింగయ్య (45) అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు పాలకవీడు మండలంలోని మహంకాళిగూడెం గ్రామానికి చెందినవారు. దామరచర్లకు వెళ్లి తన బైక్‌ను రిపేర్ చేయించుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గరిడేపల్లి మండలంలోని రాజ్యలక్ష్మి రోబో సాండ్ క్రషర్ మిల్లుకు చెందిన లారీ అదుపు కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ దాడిలో లింగయ్య తలకు తీవ్ర గాయాలు, కాలు విరిగి మరణించారు.
మృతుడికి భార్య రాణి, కుమారుడు సాయి, కూతురు మల్లేశ్వరి ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 31









