కేంద్ర ప్రాథమిక విద్యా మండలి (CBSE) ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS) మరియు నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12,799 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో KVSలో 9,156, NVSలో 3,643 పోస్టులు ఉన్నాయి.
ఈ రిక్రూట్‌మెంట్ కింద ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్స్ (PRT), లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ వంటి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం సంపాదించాలనే అభ్యర్థులు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్షలు 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించవచ్చని సూచించారు.
అప్లికేషన్ ఫీజు జనరల్/OBC అభ్యర్థులకు రూ.1,000-1,500 (పోస్ట్ ఆధారంగా), SC/ST/PWD అభ్యర్థులకు మినహాయింపు ఉంది. ఫీజు చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా చేయాలని అధికారులు సూచించారు.








