మునుగోడు మండల పరిధిలోని జమస్థాన్ పల్లి గ్రామంలో చెక్క లింగరాజు, లక్ష్మి దంపతుల గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై, కుటుంబం రోడ్డున పడిపోయింది. అన్ని సామాగ్రి అగ్నికి ఆహుతయి పోయటంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై స్పందిస్తూ, నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారట. బుధవారం ఆ మొత్తాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు బాధిత కుటుంబానికి అందజేశారు.
గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆర్థిక సహాయంతో ఆదుకుంటూ ముందుకు రాబోతున్నారని, ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పంతంగి పద్మ స్వామి, ముంత యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్, నాయకులు అందుగుల భాస్కర్, జాజుల శంకర్, అందుగుల శ్రీను, పగిళ్ల సైదులు, ముంత హేమంత్, జినుకుంట్ల ముత్యాలు, అందుగుల నరసింహ, పంతంగి వెంకన్న, జాజుల రవి, ముంత మీరన్ కుమార్, అందుగుల పరమేష్, జాజుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.









