సాధారణంగా గర్భధారణ, సంతానం స్త్రీ జీవితంలో ముఖ్యమైన దశగా భావిస్తారు. అయితే ప్రసవం తర్వాత స్త్రీ శరీరంలో హార్మోన్లు, మెదడు, శరీరం పూర్తిగా ‘రీసెట్’ అవ్వడానికి ఏడాది నుంచి రెండేండ్ల వరకు పట్టవచ్చని, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ‘పోస్ట్ పార్టమ్ రికవరీ’ స్టేజ్‌గా పేర్కొంటారు.
ప్రసవం తర్వాత ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా పడిపోవడం వల్ల ‘బేబీ బ్లూస్’కు దారితీస్తుంది. మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వంటి తాత్కాలిక మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. ప్రొలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటి మార్పులు తల్లులలో నెలల పాటు కొనసాగుతాయి.
ప్రసవం తర్వాత ఒత్తిడి వల్ల స్ట్రెస్ హార్మోన్లు విడుదలై, ఆందోళన, అలసట, ఒంటరితనం, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలకు దారితీస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యల నుంచి కోలుకోవడానికి స్త్రీలకు సమయం, నాణ్యమైన ఆహారం, కుటుంబ మద్దతు, సానుకూల ఆలోచనలు అవసరం.
కొంతమంది, ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలున్న స్త్రీలు, ప్రసవం తర్వాత ఎక్కువ కాలం హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గడం వంటి సమస్యలను అనుభవిస్తారు. వైద్య నిపుణుల సలహాలు, సానుకూల కుటుంబ వాతావరణం postpartum కోలికింగ్లో సహాయపడతాయి.









