మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్1చంద్ర’ సూపర్ హిట్‌గా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆగస్టు 28 నుండి థియేటర్స్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా, భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు సృష్టించింది.
థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలోనే దుల్కర్ సీక్వెల్ గురించి ప్రకటించారు. ఇందులో టోవినో థామస్, దుల్కర్ కీలక పాత్రల్లో నటించబోతున్నారని గ్లింప్స్ వీడియో ద్వారా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభం కాకపోయినా, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో, ‘లోకా’ సీక్వెల్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తారని దుల్కర్ చెప్పారు. “లోకా మొదటి భాగం బడ్జెట్ అనుకున్నదానికంటే రెట్టింపు అయ్యింది. నాన్నకు ఇది చెప్పినప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాడు. కానీ లాభాలు వచ్చిన తర్వాత సంతోషం,” అని తెలిపారు.
దుల్కర్ మాట్లాడుతూ, “ఇది నా తండ్రితో చేసిన మొదటి సినిమా. ఇండస్ట్రీలో 14 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం రావడం గర్వంగా ఉంది. మొదట తనను నిరూపించుకోవాలని అనుకున్నాను, అందుకే పార్ట్1లో అడగలేదు. సినిమా హిట్ అయిన తర్వాత సీక్వెల్‌లో అతను నటించమని అడిగాను. నాతో స్క్రీన్ పంచుకోవడం గర్వంగా ఉంది,” అని తెలిపాడు. ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.









