మీనాక్షి రూమర్స్‌పై స్ట్రాంగ్ వార్నింగ్

Meenakshi warns against spreading rumours online, stating she shares updates herself.

ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మీనాక్షి, చిన్న కాలంలోనే స్టార్ స్థాయిని సాధించింది. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రెండు, మూడు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘విశ్వంభర’లో కూడా ఆమె భాగమని ప్రకటించింది.

మీనాక్షి మాట్లాడుతూ, “ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి. అప్పుడు మాత్రమే నటన విలువ కనిపిస్తుంది. ‘లక్కీ భాస్కర్’లో తల్లి పాత్ర చేశాను. కథ, పాత్ర నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఇకపై పిల్లల తల్లి పాత్రలు వస్తే చేయను. పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా అవకాశం వస్తే దాన్ని కొత్త జానర్‌గా తీసుకుంటాను” అని పేర్కొంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశామని, ‘విశ్వంభర’లో పనిచేయడం తన కెరీర్‌లో స్పెషల్‌ ఛాప్టర్ అవుతుందని, అభిమానులకు తెలియజేసింది. ఈ విషయాలు మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి.

రూమర్స్‌పై స్పందిస్తూ, “నా గురించి ఏదైనా చెప్పాలంటే నేనే చెబుతా. నాకు సోషల్ మీడియా ఉంది. కాబట్టి ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share