మణుగూరు మెగా జాబ్ మేళా – 4,000 ఉద్యోగాలు

Mega job fair at Manuguru Bhadrachari Stadium on 19th will provide thousands of opportunities for unemployed youth.

ఈ నెల 19వ తేదీన మణుగూరు భద్రాద్రి స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహణ చేయనున్నారు. మణుగూరు మండలంలోని నిరుద్యోగ యువత, యువతులను ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్ కోరారు. జాబ్ మేళా పోస్టర్ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భారతదేశంలోని 100 మెగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొని సుమారు 4,000 ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుదే, సీఎం రేవంత్ రెడ్డి, సింగరేణి సి అండ్ ఎండీ బలరాం లతో మాట్లాడి ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలకు అందించిన ఘనతను వివరించారు.

పినపాక నియోజకవర్గాన్ని సాంకేతికపరంగా అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు అందించడం కూడా ఒక్క పాయం వెంకటేశ్వర్లుకు మాత్రమే దక్కిన ఘనత అని మణుగూరు కాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మైనార్టీ అధ్యక్షులు ఎండి రహీం, మండల నాయకులు గాండ్ల సురేష్, బొజ్జా త్రిమూర్తులు, అప్పన నరేష్, కొర్లకుంట అప్పారావు, వాసంశెట్టి వెంకట్రావు, బత్తుల శీను, డేగల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రాంతంలో యువతను ప్రేరేపించడం ముఖ్య లక్ష్యంగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share