ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాది హస్తం

NIA identifies Doctor Umar, linked with extremist groups, behind Delhi Red Fort blast on Monday evening.

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ గా గుర్తించబడింది. ఈ ఘటనా స్థలంపై NIA దర్యాప్తు ప్రారంభించింది. సీసీటీవీ ఫుటేజీలు ఈ బ్లాస్ట్ పై కీలక సమాచారం అందిస్తున్నాయి.

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, బ్లాస్ట్ కారు బ్లాస్టింగ్ కు 3 గంటల ముందే ఎర్రకోట హై సెక్యూరిటీ జోన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 3.19 గంటలకు కారు పార్కింగ్‌లోకి వచ్చిన తరువాత సాయంత్రం 6.22 గంటల వరకూ అక్కడే నిలిచింది. ఈ సమయంలో కారు నుండి ఎవరు కూడా బయటకు రాలేదని సమాచారం వెలువడింది.

డాక్టర్ ఉమర్ ఆ మూడు గంటల్లో ఏం చేశాడు? వేరే ఎవరినైనా కలిశాడా? బ్లాస్టింగ్ టైమ్ కోసం వెయిట్ చేశాడా? ఎందుకు అత్యంత కట్టుదిట్టమైన హై సెక్యూరిటీ ప్రాంతాన్ని ఎంపిక చేశాడో అనే ప్రశ్నలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ సమాధానాలు బయటపడే వరకు అసలు దాడి వెనుక ఉన్న సూత్రధారి ఎవరు, ఏ ఉగ్రవాద సంస్థ పాల్పడిందో స్పష్టత రాదు.

దర్యాప్తు అధికారులు జూనియర్ డాక్టర్లను స్లీపర్ సెల్స్ రంగంలోకి పంపించారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వీటన్నింటికి సమాధానాలు రాకముందు, బ్లాస్ట్ వెనుక ఉన్న సాంకేతిక, వ్యూహాత్మక మలుపుల వివరాలు పూర్తిగా బయటపరచడం కష్టమే. NIA మరియు ఇతర దర్యాప్తు సంస్థలు అన్ని సీటీలను, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దాడి వెనుక ఉన్న విపరీతమైన ఉగ్రవాద కుట్రను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share