హీరో మోటోకార్ప్ రెండు చక్రాల వాహనాల నుంచి కొత్త అడుగు వేసింది. మిలాన్‌లో జరిగిన EICMA 2025లో NEX 3 అనే చిన్న మైక్రో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ను వీడా బ్రాండ్‌లో కొత్త ‘నోవస్’ రేంజ్లో పరిచయం చేసింది. ఇది హీరోని అల్ట్రా-కాంపాక్ట్ మొబిలిటీ సెగ్మెంట్లోకి తీసుకెళ్తోంది. NEX 3ని షార్ట్ డిస్టెన్స్ సిటీ కమ్యూటింగ్ కోసం పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.
NEX 3 నాలుగు చక్రాలతో, నారో ఫుట్‌ప్రింట్, ఇద్దరు ప్యాసింజర్స్ ప్రయాణం చేయగలిగేలా రూపొందించబడింది. రెండో వ్యక్తి డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చుంటాడు. క్లోజ్డ్ క్యాబిన్ సేఫ్టీ, కంఫర్ట్ అందిస్తుంది. చిన్న కారు లాగా కనిపించినా, మాన్యువరబిలిటీ, ఎఫిషియెన్సీ టూ-వీలర్ EVలా ఉంటుంది.
హీరో NEX 3 మధ్యలో బ్యాలెన్స్, కాంపాక్ట్ ప్రాక్టికాలిటీ, వేదర్ ప్రొటెక్షన్, మినిమల్ ఫుట్‌ప్రింట్ కలిగి ఉంది. నోవస్ పోర్ట్‌ఫోలియోలో NEX 1, NEX 2 మైక్రో-మొబిలిటీ వాహనాలు మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌లు ఉన్నాయి. వీడా DIRT.E సిరీస్ కింద కొత్త ఆఫ్-రోడ్ EV మోటార్‌సైకిల్ లైన్ కూడా అనౌన్స్ చేశారు.
హీరో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా కాంపాక్ట్ EV ఫార్మాట్స్‌లోకి విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అర్బన్ మొబిలిటీలో చిన్న, ఎఫిషెంట్ వాహనాల వైపు దృష్టి సారిస్తోంది. ప్రైసింగ్, టెక్నికల్ స్పెక్స్ మరియు మార్కెట్ రోల్అవుట్ వివరాలు ప్రొడక్షన్ వెర్షన్ దగ్గర్లో లభిస్తాయి.









