కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్యాకేజ్‌డ్ వస్తువులు, ఉత్పత్తులపై ‘కంట్రీ ఆఫ్ ఆరిజిన్’ ఆధారంగా సెర్చ్ చేసే ఫిల్టర్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో ఉత్పత్తి మూలాన్ని సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది. సరైన సమాచారం ఆధారంగా వినియోగదారులు నిర్ణయాలు తీసుకోవచ్చు, తద్వారా డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో పారదర్శకత పెరుగుతుంది.
ప్రభుత్వం డ్రాఫ్ట్ లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) (రెండవ) సవరణ నియమాలు-2025 ద్వారా ప్రస్తుత ప్యాకేజింగ్ నియమాలను మార్చాలని యోచిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవసరమైన సమాచారం గుర్తించడం మరింత సులభం అవుతుంది.
ప్రజాభిప్రాయం కోసం ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో 22 వరకు ప్రదర్శించింది. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను సులభంగా కనుగొనే వీలు కల్పించడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ మరియు ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాల లక్ష్యాలకు మద్దతు లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.









