మండల కేంద్రానికి చెందిన రావిశెట్టి కిషన్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉండటంతో ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది.
ఈ విషయం రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా చేరింది. వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹60,000 మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు.
అంతేకాక, చెక్కును బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఈ సహాయ కార్యక్రమం ద్వారా కిషన్ కుటుంబం పెద్ద ఊరట పొందింది.
ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జనగామ జిల్లా కురుమ సంఘం కార్యదర్శి జయా మల్లేష్, యువ నాయకులు, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 20









