డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) ప్రెసిడెంట్ నిర్వహించిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా దేవసేన, సీఎంవో అధికారులు పై ఎటువంటి వ్యాఖ్యలు ఇవ్వలేదని స్పష్టత ఇచ్చారు.
కొన్ని వర్గాలు తమ వ్యాఖ్యలను వక్రీకరించాయి అని ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ఇప్పటికే ఖండనాన్ని అధికారులకు పంపినట్లు తెలిపారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో చర్చించి త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు.
శుక్రవారం సాయంత్రం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు FATHI ప్రకటించింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించనుందని హామీ ఇచ్చింది.
ఇప్పటివరకు రూ.600 కోట్లు ఇప్పటికే విడుదల అయ్యాయని, మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల విజయవంతతతో కళాశాలలు యథావిధిగా తెరవబడ్డాయి.









