నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డు సమస్యను పునరుద్ధరించి పాత పద్ధతిలోనే ఇన్వాలిడేషన్ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని వివిధ శాఖల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు యాజమాన్యాన్ని దృష్టికి తెచ్చి, నెలలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్స్ కి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, కోలిండియా మాదిరుగా పెర్క్స్ పై ఐటీ భరించాలని, ముఖ్యమైన పది సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్, ఉపాధ్యక్షులు అన్నారావు, సహాయ కార్యదర్శులు బి శాంసన్, జి సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, పిట్ కార్యదర్శులు, మరియు అనేక మంది యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నాయకులు యాజమాన్యానికి పత్రాలు సమర్పిస్తూ, సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనితో ఉద్యోగుల హక్కులు రక్షణలో ఉండి, పెండింగ్ సమస్యలకు సమాధానం లభించేలా చర్యలు తీసుకోవాలని వాదించారు.









