నాగిరెడ్డిపల్లి రైతులకు నష్టం పరిహారం డిమాండ్

Demand for Rs.2 crore per acre compensation for Nagireddipalli farmers losing land for IT Park; issues discussed with RDO.

నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని మహేశ్వరం నియోజకవర్గం ఐఎన్ టీయూసి కార్మిక శాఖ అధ్యక్షుడు నడికూడ శివ డిమాండ్ చేశారు.

కందుకూరు ఆర్డీవో సమక్షంలో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ, “రైతుల కష్టార్జిత భూములు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. రైతులకు న్యాయమైన పరిహారం అందే వరకు పోరాటం కొనసాగుతుంది” అన్నారు.

ఈ సమావేశంలో ఐఎన్ టీయూసి రైతుల హక్కులను కాపాడడానికి ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చింది. భూముల కోల్పోతున్న రైతుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో పలువురు రైతులు తమ సమస్యలను ఆర్డీవోకు వివరించారు. భవిష్యత్తులో ఈ భూముల కోసం సరియైన పరిహారం చెల్లించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share