పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా “ది రాజాసాబ్” జనవరి 9, 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది.
“ది రాజాసాబ్”ను రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటించారు. ఈ సినిమాకు అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు.
సినిమా కోసం అమెరికాలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు వాసులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.
తెలుగులో కేవలం ప్రెస్ మీట్లతో మాత్రమే ప్రీ-రిలీజ్ జరగనుండగా, అమెరికా ఈవెంట్ గ్రాండ్‌గా ఉండనుంది. ప్రభాస్ అభిమానులు ఈ ప్రత్యేక వేడుక ఏ మేరకు విజయం సాధిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









