రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతామని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళన చెందకూడదని ప్రజలకు స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవాలని ప్రజలకు కోరుతూ బుధవారం ఎల్లారెడ్డి గూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాశ్ నగర్, తవాక్కల్ నగర్, అలీ నగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
శ్రీధర్ బాబు, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికి వివరించారు. తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులను విస్మరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
మా అభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్నందున, జూబ్లీహిల్స్ ఓటర్లను ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవమని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంక్షేమ, అభివృద్ధి అజెండాకు మద్దతు ఇవ్వాలన్నారు.









