మోటరోలా తన ‘జీ’ సిరీస్‌లో కొత్త ఫోన్ మోటో జీ67 పవర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్, భారీ బ్యాటరీ, మెరుగైన కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది. జీ67 పవర్ హై-ఎండ్ ఫీచర్లను బడ్జెట్ ధరలో అందించటం విశేషం.
జీ67 పవర్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50MP (Sony Lite-600) మెయిన్ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి, 4కె వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
7000mAh బ్యాటరీతో వచ్చిన జీ67 పవర్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా ఫీచర్లలో ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఆటో నైట్ విజన్, ఏఐ-పవర్డ్ పోర్ట్రెయిట్స్, ఆటో స్మైల్ క్యాప్చర్, హై-రైజ్ జూమ్, మోటరోలా ఏఐ టూల్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
జీ67 పవర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది: 8GB+128GB ధర రూ.15,999, బ్యాంక్/ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.14,999కే లభిస్తుంది. 8GB+256GB వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది, ధరలు కంపెనీ త్వరలో ప్రకటించనుంది.









