టాలీవుడ్ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ త్వరలో తన కొత్త సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రోమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో తన భార్య చిన్మయి మంగళసూత్రం ధరించకపోవడంపై రాహుల్ స్పందిస్తూ, పెళ్లి తర్వాత మహిళలు తాళిని కచ్చితంగా ధరించాలి అనేది అతను మద్దతు ఇవ్వనని పేర్కొన్నారు. ఎప్పుడు తాళి పెట్టాలో ఎవరికి చెప్పనని, సంప్రదాయం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని అన్నారు.
రాహుల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అతనిని సపోర్ట్ చేస్తూ సమర్థించారు. అయితే, కొందరు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఫిర్యాదులలో “ఇలాంటి అభిప్రాయాల వల్ల గౌరవం తగ్గింది” అని పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్‌లు సోషల్ మీడియాలో వివాదానికి కారణమయ్యాయి.
ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో సూటిగా స్పందించారు. “మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు సమాజంలో మహిళలకు భద్రత లేదు. అనేక చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పుట్టిన పసికందులపై కూడా దారుణాలు ఆగడం లేదు” అని ఆయన కౌంటర్ పెట్టారు.
చిన్మయి స్పందనతో మహిళల భద్రత మరియు సంప్రదాయ ఆచారాలపై చర్చ మరింత వేగవంతమైంది. రాహుల్ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్లు, చిన్మయి తిప్పి సమాధానం, సమాజంలో మహిళల హక్కులు, భద్రతపై ప్రజల దృష్టిని మరింత ఆకర్షించాయి. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చను రేకెత్తించింది.









