నిర్మాత ఎస్‌కెఎన్(SK N) నిర్మించిన ‘బేబీ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఎస్‌కెఎన్ రేంజ్, ప్రమోషనల్ స్టయిల్, మార్కెట్ క్రేజ్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం ఎస్‌కెఎన్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ, వివిధ ఈవెంట్లలో పాల్గొని, సరదా, వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా, ‘తెలుసు కదా’ సినిమా సక్సెస్ మీట్‌లో ఎస్‌కెన్ మరియు బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ చిత్రం నీరజ్ కోన దర్శకత్వంలో రూపొందింది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటించి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సక్సెస్ మీట్‌లో భాగంగా, బండ్ల గణేష్ ఎస్‌కెఎన్‌ను ఉద్దేశించి “మీలాాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం సీనీ పరిశ్రమకు చాలా ప్రమాదకరం. అందుకే మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి, కొత్త కాంబినేషన్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో, బండ్ల గణేష్ లాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్‌కి దూరంగా ఉంటే ఇండస్ట్రీకి కూడా అంతే ప్రమాదం” అని వ్యాఖ్యానించాడు.
ఈ కామెంట్లు అక్కడున్న వారంతా నవ్వడానికి కారణమయ్యాయి. వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ అభిమానులలో పెద్ద చర్చను రేపింది. ఎస్‌కెఎన్ పై బండ్ల గణేష్ కామెంట్లు, సరదా ప్రవర్తనతో కూడిన ఈ వీడియో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.









