తనిఖీలపై స్థానికుల ఆవేదన
మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు చేపట్టిన వెహికిల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పోలీసులు ప్రజలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యులపైనే కఠినతర చర్యలు
వాహన పత్రాలు లేని వారిని, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిని, మద్యం సేవించి వాహనం నడిపిన వారిని పోలీసులు తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీలు సామాన్య ప్రజలపైనే కేంద్రీకరించబడ్డాయని, అధికార వాహనాలు లేదా ప్రభావశీలుల వాహనాలు ఆపలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల ప్రవర్తనపై విమర్శలు
పలువురు ప్రయాణికులు హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి ప్రవర్తన సరిగా లేదని ఆరోపించారు. మర్యాదగా మాట్లాడినా, వల్గర్ పదజాలం ఉపయోగించి బెదిరించారని, గౌరవంగా సంభాషించిన వారినే అవమానించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక లారీలకు మినహాయింపు?
ఈ తనిఖీల్లో ఇసుక లారీలను పోలీసులు ఆపకపోవడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. “వాటిని ఆపే అధికారం లేదు”, “ఊటూర్లో చెక్ చేస్తున్నారు” అంటూ విభిన్న సమాధానాలు ఇచ్చి లారీలను వదిలేయడం మరింత అనుమానాస్పదంగా మారిందని ప్రజలు విమర్శించారు.









