హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బీసీ చైతన్య వేదిక, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో “బీసీ రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ” అనే రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు పాల్గొని బీసీ రిజర్వేషన్ల అవసరాన్ని, సామాజిక న్యాయం పరిరక్షణకు బహుజన ఉద్యమం అవసరాన్ని చర్చించారు.
బీసీ చైతన్య వేదిక ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఛైర్మన్ సాయి నరేంద్ర, వీసీకే పార్టీ నేత డాక్టర్ జిలకర శ్రీనివాస్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ తదితరులు ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు ఐక్యంగా ఉండాలని, బహుజనుల ఓట్లు బహుజనులకే వేర్చాలని పిలుపునిచ్చారు.
సభలో నాయకులు, “రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి” అని ఆరోపిస్తూ, రిజర్వేషన్ల సాధన కోసం సకల సంఘాలతో కలిసి పార్టీలకు అతీతంగా ఉద్యమ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. బీసీ కుల జనగణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో సమాన హక్కులు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో ఈ ఉద్యమం కొనసాగనుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తాడిశెట్టి క్రాంతికుమార్, చాపర్తి కుమార్ గాడ్గే, గొల్లపల్లి వీరస్వామి, బక్కి యాదగిరి, సోమిడి అంజన్‌రావు, వేణుమాధవ్, ధర్మపురి రామారావు, తిరుపతి, నూర సంపత్ పటేల్, జంగిలి శ్రీనివాస్ తదితరులు, న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, రాచకొండ ప్రవీణ్‌కుమార్, కందగట్ల సుధాకర్, అల్లం నాగరాజు, ఎగ్గడి సుందర్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ ఉద్యమ నాయకత్వం, యువత మరియు సామాజిక కార్యకర్తల సమన్వయంతో బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రాధాన్యతను ఇచ్చింది.









