శిల్పా-రాజ్ విదేశీ పర్యటనపై హైకోర్టు స్టాప్

Bombay High Court rejects Shilpa Shetty and Raj Kundra’s plea to travel abroad in a ₹60 crore cheating case.

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు నుండి పెద్ద షాక్ తగిలింది. రూ.60 కోట్ల మోసం కేసులో ఈ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా-రాజ్ దంపతుల పిటిషన్‌ను కోర్టు తాజాగా కొట్టివేసింది.

కోర్టు స్పష్టంగా తెలిపింది — దేశం విడిచి వెళ్లాలంటే ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలని. కోర్టు ఆదేశాలను పాటించకుండా విదేశాలకు వెళ్లడం అసాధ్యమని పేర్కొంది. దీంతో శిల్పా-రాజ్ ప్రణాళికలకు పెద్ద బ్రేక్ పడింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, లుకౌట్ నోటీసులు చెల్లుబాటు అవుతాయని కోర్టు స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే — ఒక వ్యాపారవేత్త రూ.60 కోట్ల మోసం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అక్టోబర్ 25 నుండి 29 వరకు కొలంబోలో జరిగే ఒక ఈవెంట్‌కు హాజరు కావాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కోర్టు అనుమతి కోరగా, న్యాయమూర్తి — “మీకు అధికారిక ఆహ్వానం ఉందా?” అని ప్రశ్నించారు.

శిల్పా తరఫు న్యాయవాది స్పందిస్తూ, “ప్రస్తుతం ఫోన్ ద్వారా మాత్రమే ఆహ్వానం వచ్చింది, కోర్టు అనుమతి ఇస్తే అధికారిక పత్రాలు వస్తాయి” అని తెలిపారు. అయితే కోర్టు ఆ వివరణను సరైనదిగా అంగీకరించలేదు. “లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం సబబు కాదు” అంటూ స్పష్టం చేసింది. దీంతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు హైకోర్టు తీర్పు చుక్కెదురైందని చెప్పాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share